Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: నీతో నిరంతరంయేసయ్యా
ప, నా దైవమా నా ప్రాణమైనా
నాతో ఎప్పుడు బంధమైరా
నీవు లేక భువిలో బంధములేదే
నీ ప్రేమలేని జీవితం వ్యర్ధముగా
1. నా జీవితం ప్రకాశింప దీపమైరా
నా దీన స్థితిలో కౌగిలింప తల్లివైరా
తప్పులన్ని సరిచేయు తండ్రివైరా
ఒంటరిగా వున్న వేళ నేస్తమైరా
2. ప్రతి దినము ప్రార్థించగ ప్రభుడవైరా
నా హృదయాన్ని గుడిగమార్చ వాక్కువైరా
వెదకుచున్న కన్నులతో వెలుగువైరా
నా హృదిన నిరంతరము పాలింపగరా