Lyrics/Tune: Fr. Thomas Pasala
Tune: unknown
Music: Naveen M
Album: నీపద సేవలో-2
నా హృదయ ద్వారము చెంత -
నిలచియున్న నా యేసయ్యా
నా హృదయ ద్వారము చెంత
తట్టుచున్న నా యేసయ్యా
రావయ్యా నా హృదిలో నివసింప రావయ్యా
రావయ్యా నా హృదిలో నిదురించ రావయ్యా -
యేసయ్యా నా మెస్సయ్యా
1. భయపడకని భయపడకని పలికిన దేవుడవు
నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభుడవు
రావయ్యా నా హృదిలో నివసింప రావయ్య
రావయ్య నా హృదిలో నిదురించ రావయ్యా -
యేసయ్యా నా మెస్సయ్యా
2. ఏ క్షణమున పిలిచిన పలికే దేవుడవు
నా కాలు జారనీక కాపాడే ప్రభుడవు
రావయ్య నా హృదిలో నివసింప రావయ్య
రావయ్య నా హృదిలో నిదురించ రావయ్యా -
యేసయ్యా నా మెస్సయ్యా