Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
నా హృదయం తెరిచాను - నీ కోసమే ప్రభూ
నీ మందిరం కావాలి - నా మది ఎల్లప్పుడు ||2||
1 వ చరణం..
నా ఆశవు నా శ్వాసవు - నా గమ్యము నీవే
నాలో నివసింపుము - నా జీవన రాగమే ||2||
నన్ను నీవు మరచావో - నా బ్రతుకే శూన్యం ||2||
నీ సన్నిధియే కదా నాకు పెన్నిధి ప్రభువా ||2||llనాll
2 వ చరణం..
నీ రెప్పల మాటున - నన్ను దాగి పోని ||2||
నీ ఆలయ దీపానికి - ఆజ్యమై కరిగి పోనీ ||2||
నీ చరణాలపై వాలే - ధూళి రేణువుకాని ||2||
నీ దరిని కడదాక నన్ను ఉండిపోని ||2|| llనాll