Type Here to Get Search Results !

నా హృది కోవెలలో ( Naa hrudhi kovelalo Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నా హృది కోవెలలో - జీవన వాకిటలో 

జ్యోతులు వెలిగించి - నీకై వేచాను ll 2 ll 


1 వ చరణం.. 

జీవన పుష్పాలు - నీకై ఏరాను 

స్నేహపు మాటలను - నీకై అల్లాను ll 2 ll 

నీ ఎదపై జీరాడి - ధన్యతకై పోరాడి ll 2 ll 

స్వాగతమివ్వాలి - స్వాగతమివ్వాలి ll 2 ll 


2 వ చరణం.. 

నా గృహ ద్వారాన్ని - నీకై తెరిచాను 

పూజా పీఠాన్ని - అలంకరించాను ll 2 ll 

నిర్మల హృదయముతో - అర్చన సుమములతో ll 2 ll 

పూజలు చెయ్యాలి - పూజలు చెయ్యాలి ll 2 ll 


3 వ చరణం.. 

దర్శన భాగ్యాన్ని - దయచేయుము దేవా 

జీవన మార్గాన్ని - చూపించుము దేవా ll 2 ll 

నా ప్రార్థన ఆలించి - నీ దీవెనలందించి 

ధన్యత నొసగుమయా - ధన్యత నొసగుమయా 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section