Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నా జీవితాంతం నీ దివ్య నామం `
కొనియాడి స్తుతియించెదన్ ||2||
జీవిత యేసా సుత సర్వేశా `
నీ చెలిమి నాశించితి llనా జీవిll
1 వ చరణం..
ఆనందముతో ఎడతెగక నిరతం
భజియింతు నీ నామమే........
నిందావమానం నను వెంటాడిన `
నీ దయకై నిను వేడెదన్
కృపగల యేసా నీ ప్రేమ నిరతం` కొనియాగడను దయనిడుమా ||2||
నా జీవమా నా ప్రాణమా `
నిను నేను కొనియాడెదన్ llనా జీవిll
2 వ చరణం..
నిండు మనసుతో పరిపూర్ణ హృదితో
స్మరియింతు నీ నామమే.......
బలహీనతలో నిర్బాగ్యములో`
నీ బలము నానొసగుమా
నీ కనుపాపలో నను కరుణించు`
నిత్యము నాలో వసియించు ||2||
నా జీవమా నా ప్రాణమా `
నిను నేను కొనియాడెదన్ llనా జీవిll