Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P
Music: Naveen M
Album: యేసే నా ఆశ - 2
సా :ఆశా ....... యేసే ....... నా ఆశా ....
ప. నా కళ్ళకు ఎంత ఆశ
నీవు కానరావని తెలిసినా
వెతుకుతూ వెతుకుతూనే ఉంటాయి ||2||
శరణు శరణు యేసు దేవా
నీ కృపయే చాలుదేవా ||2|| ||నా||
1. నా కాళ్ళకు ఎంత ఆశ
నీవు నాకు అందవనితెలిసినా
పరుగెత్తుతూ గెంతుతూనే ఉంటాయి ||2||
శరణు శరణు యేసు దేవా
నీ కృపయే చాలుదేవా ||నా||
2. నా మనసుకు ఎంత ఆశ
నీవు నాలో ఉన్నావని తెలిసినా
తలస్తూ తలస్తూనే ఉంటుంది
శరణు శరణు యేసు దేవా
నీ కృపయే చాలుదేవా ||నా||