Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నా కలిమి నాబలిమి - నీ చెలిమి ఫలమేగా
నాకున్న సిరులన్ని - నీ ప్రేమ చలవేగా
నా జీవితమంతయు - నీ పీఠము చెంతన ||2||
సమర్పించు చున్నాను - స్వీకరించుదేవా ||2||
1 వ చరణం..
నా రూపము నీ వరము - నా ఊపిరి నీదానము
నాలోని ప్రతి అణువు - నీ ప్రేమ సృజనం
నా జీవిత ప్రతి క్షణము - నీ ఒసగిన వరమేగా
సమర్పించు చున్నాను - స్వీకరించుదేవా ||2||
2 వ చరణం..
ఎండలలో వానలలో - కష్టించి పొందిన
ఈ భూ ఫలములు - నవ ధాన్యములును ||2||
నా నిండు మనస్సుతో - నీ పీఠము చెంతన ||2||
సమర్పించుచున్నాను - స్వీకరించు దేవా ||2||