Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నా ఊపిరిలో ఊపిరిని నీవే
నా గమనంలో కాపరివి నీవే ||2||
పేరు పెట్టి పిలిచిన హితునివి
నన్ను కాయు పరలోక సుతునివి
దేవా..దేవా.. నీ మేలు మరువనయా
దేవా..దేవా.. నీ మేలు మరువనయా ||2||
1. క్రుంగిన సమయములో
వంగి నన్ను లేపితివి
క్షణభంగుర ఆశలకు
లొంగకుండా నడిపితివి ||2||
నీ హృదయంలో నిలిపి పదిలంగా
ఉంచితివి ||2||
దేవా..దేవా.. నీ మేలు మరువనయా
దేవా..దేవా.. నీ మేలు మరువనయా ||2|| ||నా ఊపిరిలో||
2. నిను నమ్మిన ఈ దాసుని
స్నేహితునిగ పిలిచితివి
జ్ఞాన గ్రంధసారము-బోధింపనేర్పితివి ||2||
బహు చక్కగ మలచి
నీ సేవలో నిలిపితివి ||2||
దేవా..దేవా.. నీ మేలు మరువనయా
దేవా..దేవా.. నీ మేలు మరువనయా ||2||
||నా ఊపిరిలో||