Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నజరేయుడా ` నా యేసయ్యా
ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం
నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదాllనజll
1 వ చరణం..
ఆకాశ గగనాలును నీ ` జేనతో కొలిచితివి ||2||
శూన్యంలో యీ భూమిని -
వ్రేలాడ దీసినా ` నా యేసయ్యా ||2||
నీకే వందనం ` నీకే వందనం -
నీకే వందనం ` నీకే వందనం ||2||
2 వ చరణం..
అగాధ సముద్రాలకు నీవే ` ఎల్లలు వేసితివి ||2||
జలములలో బడినే వెళ్ళినా -
నన్నేమి చేయవు ` నా యేసయ్యా ||2||
నీకే వందనం llనజరేll
3 వ చరణం..
సియోను శిఖరాగ్రమూ నీ ` సింహాసనమాయెనా ||2||
సియోనులో నిన్ను చూడాలని -
ఆశతో ఉన్నాను నా యేసయ్యా ||2||
నీకే వందనం llనజరేll