Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నా కంటి పాపవు నీవే
నా నిండు రూపం నీవే
నీ గుండె గుడిలో కొలువుండ
ప్రసాదమై నేనొచ్చా
1. నిన్ను నింగి కెత్తాలని
నే నేలపై కాలు మోపాను
నీ పాపాన్ని తుడిచేయాలని
నీ కోసం సిలువెక్కాను
అందుకే ఇస్తున్నా నా దేహం
ఇదుగో ఇస్తున్నా రక్తం ||2||
2. నీవు నిత్యం జీవించుట
నా తండ్రి సంకల్పం
నా ఉత్థానంలో నీవు భాగస్తుడు కావాలి
అందుకే ఇస్తున్నా
నా దేహం ఇదుగో ఇస్తున్నా రక్తం ||2||