Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం 1
ప. నామనసే నీ ఆలయము
నాలో వసియింపవా
ఓ దేవా నన్ను నడిపింపవా
శరణం దేవా! శరణం దేవా
1. రాతి గుండెను అనురాగ గుడిగా మలచుమయా
నీరూపం నామదిలో నిరతము నిలుపుమయా
ఓ దేవా నిరతము నిలుపుమయా ||నా||
2. నీరు లేక బీటలు బారిన నేలవలే
నా హృదయం నీకోసం తపించుచున్నది
ఓ దేవా తపించుచున్నది ||నా||