Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి
నా తండ్రి యేసునే నేను చూడాలి
నా నాన్న ఇంటిలో వాగ్దానం వున్నది
నా నాన్న ఇంటిలో సంతోషం వున్నది
నా నాన్న ఇంటిలో నాట్యం వున్నది
1. మగ్ధలేన మరియ లాగా - నీ పాదాలు చేరెదను ||2||
కన్నీటితో నేను కడిగెదను
తల వెంట్రుకలతో తుడిచెదను ||2|| ||నా నాన్న||
2. బెత్లెహేము మరియలాగా - నీ సన్నిధి చేరెదను ||2||
నీ వాక్యమును నేను ధ్యానింతును
ఎడతెగక నీ సన్నిధి చేరెదను ||2|| ||నా నాన్న||
3. నీ దివ్య సన్నిధిలో నాకు మధురముగా వున్నదయ్యా ||2||
పరలోకానందం పొందెదను
ఈ లోకమును నేను మరచెదను ||2|| ||నా నాన్న||