Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నా యేసు సన్నిధిలో - సకల దివ్య దీవెనలు
తనదు హస్తనీడలో నిత్య సౌక్యసంతోషాలు
అదే నాకు ఆనందం అదే బ్రతుకు సాఫల్యం
1. గతంనంతా వీడితిని హృదిని పరచి వేడితిని
ప్రభు పలుకు విని.... పరవశించితిని ||2||
పరలోక పట్టణమందు ప్రభు చేసెను ఆత్మకు విందు
పరిశుద్ధుల సంఘమునందు సాక్షాసం నిలుతును నిండు
ఇదే నాకు ఆనందం ఇదే బ్రతుకు సాఫల్యం
2. కలుషాలు విడిపోయే కలతలింక ఎడమాయే
కరుణ జాలి నిండిమదికి కలిగే నెమ్మది
కష్ట నష్టాలెన్ని వున్న కలకాలం ప్రభువుతో వుంటా
కమనీయ ప్రేమల వాక్యం కాక్షించి నడుతు వెంటా
ఇదే నాకు ఆనందం ఇలా వుండి పోతే చాలు.