Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నా ఊపిరిలో ఊపిరివి నీవే
నా గమనంలో కాపరివి నీవే
పేరు పెట్టి పిలిచిన హితునివి
నన్ను కాయు పరలోక సుతునివి
దేవా - దేవా - నీ మేలు మరువనయా||2||
1. కృంగిన సమయములో
వంగి నన్ను లేపితివి
క్షణభంగుర ఆశలకు
లొంగకుండ నడిపితివి
నీ హృదయంలో నిలిపి
పదిలంగా వుంచితివి
దేవా దేవా నీ మేలు మరువనయా||2||
2. నిను నమ్మిన ఈ దాసుని
స్నేహితునిగ పిలిచితివి
జ్ఞానగ్రంథ సారము
బోధింప నేర్పితివి
బహు చక్కగ మలచి
నీ సేవలో నిలిపితివి
దేవా దేవా నీ మేలు మరువనయా ||2||