Type Here to Get Search Results !

నే సాగెద యేసునితో ( ne sagedha yesunitho Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా 

యేసుతో నడిచెద-యేసుతో గడిపెద 

పరమున చేరగ నే వెళ్ళేద 

హనోకువలె సాగెద ||నే|| 


1. తల్లి విడిచిన-తండ్రి మరచిన 

బంధువులే నను వెలివేసినా 

బలవంతునితో సాగెదా ||నే|| 


2. కష్టములొచ్చినా-నష్టములొచ్చినా 

శోధన బాధలు- చెలరేగినా 

విశ్వాసముతో సాగెదా ||నే|| 


3. వెనుక శత్రువుల్-వెంటాడినను 

ముందు సముద్రం ఎదురొచ్చినా 

మోషేవలే సాగెద ||నే|| 


4. లోకపు శ్రమలు నన్నెదిరించిన 

కఠినులు రాళ్ళతో హింసించిన 

స్టీఫెనువలె సాగెదా ||నే|| 


5. బ్రతుకుట క్రీస్తే-చావైన మేలు 

క్రీస్తుకు హతసాక్షిగా మారేదా 

పౌలువలె సాగెదా ||నే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section