Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నా ప్రజలారా నా ప్రియులారా -
నా దేహమును నా రుధిరమును
ఆరగించండి జీవం పొందండి -
ఆరగించండి ఆనందించండి
1. ప్రియమార నా తండ్రి ధరపైన నను పంప -
ఆ తండ్రి మూలమున నే జీవింప
నాదైన జీవము నిండుగ పొంద -
నా మూలమున నిత్యము జీవింప
2. నాలోన మీరుండ మీలోన నేనుండ -
మీలోన జీవము నిరతము నిండ
మీ విశ్వాసం పరిపూర్ణమొంద -
అంతిమ దినమున దివ్యము చెంద