Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
నా ప్రాణ ప్రియుడ
యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదన్... ||2||
నా హృదయ నివాసి యేసయ్యా`కీర్తించి
భజియింతు నీ నామము ||2||
సత్ప్రసాద ప్రభు సన్నుతించెదనయ్యా
నా హృదయమే నీ ఆలయం ||2||
1 వ చరణం..
నా జీవిత కర్తవు నీవు నా జీవన శైలినీవు... ||2||
నా హృదయ దీపము నీవు ... ||2||
నా త్రోవకు వెలుగునీవు `
సత్ప్రసాద ప్రభూ సన్నుతించెదమయ్యా
నా హృదయమే నీ ఆలయం ||2|| llనా ప్రాణ ప్రియుడాll
2 వ చరణం..
నా హృదయ తరంగమంత నీ నామ సంకీర్తనేగ... ||2||
నా మార్గ చూపరి నీవని... ||2||
నే పాడెద జీవితాంతం... ||2||
సత్ప్రసాద ప్రభూ సన్నుతించెదమయ్యా
నా హృదయమే నీ ఆలయం ||2|| llనా ప్రాణ ప్రియుడాll