Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఆ...ఆ...ఆ....
ప: నా ప్రాణమా పరుగు తీయుమా -
నా ఆత్మమా ఆరగింపుమా
పరము నుండి దిగివచ్చిన ప్రభుయేసుని దేహము
స్వీకరించుమా శుద్ధినొందుమా
తనా తానానానా తననా తననా
1. అలసిన వారికి అమృతం ఈ విందు -
అదరిన గుండెకు ఆత్మ బలం ఈవిందు
పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై
మనకొసగిన ఆ భోజ్యం స్వీకరింపుమా శుద్దినొందుమా
పమపసా సనిసగా పమగసనిస లా....లలలలా
2. పాపము బాపిన పరిశుద్దుడు -
మరణము గెలిచిన మృత్యుంజయుడు
మనపాప క్షాళనకై మనుజాళి రక్షణకై
మనకొసగిన ఈ భోజ్యం స్వీకరింపుమా శుద్ధినొందుమా
పమపసా సనిసగా పమగసనిస