Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: నేనే మార్గం
ప. నా ప్రతి అడుగు నీ చేతితో
నడుపుమయా నా యేసయ్యా
నా ప్రతి తలపు నీ ప్రేమతో
నింపుమయా నజరేయా
స్తోత్రమయా నా యేసయ్యా
శరణమయా నజరేయా
1. నీవే మా ప్రభువని తలచి
హృది నిండా నిను కొలచి
జీవన యానములో
నీ తోడును కోరితి ||స్తోత్రమయా ||
2. వేదన నిండిన హృదయములో
వెలుగులు నింపుమా
తనువు మనసంతా
నీ సొంతము చేసితి ||స్తోత్రమయా ||