Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నా ప్రియదైవమా... నా ప్రాణనేస్తమా
కృతజ్ఞత హృదయముతో అర్పించవచ్చాను
నీ కృపతో నిండిన - ఈ జీవితమంతా ||2||
సమర్పించ నిలిచాను - నీ సేవచేయగ ||2||
.... నీ సేవ చేయగ ||నా ప్రియ||
1. అప్పద్రాక్షరసములు బదులు అర్పించెద
నా జీవితం
ప్రీతితో స్వీకరించి మార్చుము/మార్చునన్ను
మహిమ కరముగా
విలువైన వరములు ఎన్నో - ఒసగినావు
నా బ్రతుకులో ||2||
నీవిచ్చిన దానములే - అర్పించ
నిలిచాదేవా ||2||
..... అర్పించ నిలిచా దేవా ||నా ప్రియ||
2. అర్హతే లేనినన్ను నీ సేవకు అర్పించగా
దీవించి దయచేసావు - ధన్యమైన
ఈ జీవితం
నా సకలం సర్వం అర్పించెద దేవా ||2||
నీ దివ్య సన్నిధిలో నిత్యార్పణగా ||2||
.... నిత్యార్పణగా ||నా ప్రియ||