Type Here to Get Search Results !

నా వన్నీ యంగీకరించుమీ ( Naa vani yangikarinchumi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నా వన్నీ యంగీకరించుమీ దేవా- 

నన్నెపుడు నీవు కరుణించుమీ 


1 వ చరణం.. 

నావన్నీ కృపచేత - నీ వలన నొందిన 

భావంబునను నేను - బహుధైర్యమొందెదllనాll 


2 వ చరణం.. 

నీకు నా ప్రాణము - నిజముగా నర్పించి 

నీకు మీదు గట్టి - నీ కొరకు నిల్పెదllనాll 


3 వ చరణం.. 

సత్యంబు నీ ప్రేమ - చక్కగ మదిబూని 

నిత్యంబు గరముల - నీ సేవ జేసెదllనాll 


4 వ చరణం.. 

నీ సేవ జరిగెడు - నీ ఆలయమునకు 

నాసచే నడిపించు - మరల నా పదములుllనాll 

5వ చరణం.. 

పెదవులతో నేను - పెంపుగ నీ వార్త 

గదలక ప్రకటింప - గలిగించు ధృడభక్తిllనాll 


6వ చరణం.. 

నా వెండి కనకంబు - నా తండ్రిగైకొను 

మీ యావంతయైనను - నాశింప మదిలోనllనాll 


7వ చరణం.. 

నీవు నా కొసగిన - నిర్మల బుద్ధిచే 

సేవ చేయగనిమ్ము - స్ధిర భక్తితో నీకుllనాll 


8వ చరణం.. 

చిత్తంబు నీ కృపా - యుత్తంబు గావించె 

మత్తిల్ల కుండగ - మార్గము దొపుముllనాll 


9వ చరణం.. 

హృదయంబు నీకిత్తు - సదనంబు గావించి 

పదిలంబుగా దాని - బట్టి కాపాడుముllనాll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section