Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నా సృష్టి కర్తవు నీవేనయా
నాకున్న సర్వము నీ కరుణయేగా
ఏమున్నదయ్యా నీకియ్యను ||2||
ఏమియు లేని నిరుపేదను ||2|| ||నా సృష్టికర్త||
1. చేకొను దేవా ఈ బలి అర్పణ
క్రీస్తే సలిపిన ప్రాణార్పణ
అప్పద్రాక్ష రసమర్పణ ||2||
ప్రభువే ఒసగిన జ్ఞాపకార్పణ ||2|| ||నా సృష్టికర్త||
2. గైకొను దేవా మా స్తుతి అర్పణ
ప్రేమతో తెచ్చిన హృదయార్పణ
స్వీకరించుమా ఆత్మార్పణ ||2||
వందన పూరిత ప్రేమార్పణ ||2|| ||నా సృష్టికర్త||