Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నా సర్వము ప్రభుకే అంకితం
నా జీవితం ప్రభూకే అంకితం
నా యేసుని స్వరమే వినబడే
నా భాగ్యమాయెనూ-అల్లెలూయా.... ||2||
1. కలకాదు నిజముగనే, కబడెను నా ప్రభువు
ఈ భువిలో, అదియే భాగ్యము ||2||
త్రుణమైన నా బ్రతుకు దేదీప్యమై
ఋణమాయె నా మనస్సు ప్రభు ప్రేమకై ,
నా ప్రభువే - నా వరమే ||నా సర్వము||
2. అపురూపం - ప్రభురూపం
దయనీయం - ప్రతి చూపు
దేదీప్యమై వెలిగే నాకది ||2||
వివరించి పాడాలి ప్రతివేళలో
ప్రచురించి తెలపాలి ప్రతివానికి
నా యేసుని - ఈ దినమే ||నా సర్వము||