Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P
Music: Naveen M
Album: యేసే నా ఆశ - 7
నా తనువు నా మనసు - నా సర్వం అర్పింతును
నీ పూజకే - నీ సేవకే
1. నాకున్నవన్ని నీ దానములే - నీకున్నవన్ని నాకోసమే (2)
వినయముతో విధేయతతో-అర్పింతును దీవించుము ||నీ||
2. నీ దివ్య గురువుల కరములద్వారా - అంగీకరించు
ఈ బలిని రాగముతో అనురాగముతో- అర్పింతును స్వీకరించు ||నీ|