Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం-17
సా. నాదని ఉన్నదంతా నీదే ప్రభు
ఏ స్థితి అయిన నిన్ను కోల్పోనయా
జీవన ఊటయు ఆధారం నీవే
నీవు లేక నే బ్రతుకలేను ||2||
యేసయ్యా నా యేసయ్యా ||4|| ||నాదు||
1. నీవు లేని ఈ రోజంతా రోజేనా.
నీవు లేని ఈ బ్రతుకంతా శూన్యమేగా ||2||
కడలి లేక ఓడలేదు నీవు లేక బ్రతుకు లేదు
జీవించు కాలమంతా నీ వొసగే భాగ్యమయ్యా
2. నాలోని సమస్తము ఎరిగిన ప్రభు నీవేగా
అన్నిటిని దీవెనగా మలచు తండ్రి నీవేగా
ఏడ్చినా నేనవ్వినా తల్లిదండ్రి నీవేగా
నీ నీడలోనే ఆత్మకు నెమ్మది .. ||2||