Lyrics/Tune: Joseph Konda
Music: Praveen M
Album: పరిశుద్ధాత్మ సన్నిధి - 3
నాకు ఆధారము నీవేనయ్యా - నా ఆరాధన నీకేనయ్యా
నిన్ను వదలి నేను ఉండలేనయ్యా
నిన్నే నేను నమ్మితి యేసయ్యా ||2||
1 వ చరణం..
గాలిని ఇచ్చినది నీవే - గగనాన్ని చేసినది నీవే ||2||
నీటిపైన నడిచినది నీవే - నిత్యము కాపాడునది నీవే ||2||
నిన్ను వదలి నేను ఉండలేనయ్యా నిన్నే నేను నమ్మితి యేసయ్యా ||2|| llనాకుll
2 వ చరణం..
ప్రాణము పోసినది నీవే - పరిశుద్ధత నింపినది నీవే ||2||
యాజకునిగా మార్చినది నీవే - ఎడబాయక కాచునది నీవే ||2||
నిన్ను వదలి నేను ఉండలేనయ్యా నిన్నే నేను నమ్మితి యేసయ్యా llనాకుll