Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: స్వర సుమాంజలి
ప. నాదు జీవితము... మారిపోయినది
నిన్నాశ్రయించిన వేళ..
నన్నాదుకొంటివి ప్రభువా
1. చాలునయ్యా దేవా...
నా జన్మ ధన్యమే ప్రభువా
పాపకూపము విడచి..
నీ దారి నడిచితి దేవా ||2||
నిన్నాశ్రయించితి ప్రభువా... ||నా||
2. కన్నుగానని దిశగా...
బహుదూరమేగితినయ్యా
నీ ప్రేమ వాక్యము వినగా...
నా కళ్ళు తెరచెను దేవా ||2||
నిన్నాశ్రయించితి ప్రభువా.... ||నా||
3. లోకమంత విషమై ...
నరకాగ్ని జ్వాలలు రేగే చేరగల నీదరికి
పాపినయ్యా ప్రభువా...
నే పాపినయ్యా ప్రభువా... ||నా||