Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: స్వర సుమాంజలి
ప. నిండుగ మెండుగ దీవెనలిచ్చిన దేవునికి
వందనం అభివందనం శుభవందనం
మా హృదయపూర్వక స్తోత్రం
నిండుగా నూరేళ్ళ సేవలో నడిపిన
స్వామికి స్తోత్రము స్తుతి స్తోత్రము ||2||
మా యేసు రాజుకే స్తోత్రం ||2|| ||ని||
1. తల్లిగా లాలించినావు
తండ్రిగా పోషించినావు
మా అడుగులు స్థిరపరచినావు
నీ సేవలో బ్రతికించినావు ||2|| ||ని||
2. వాక్యమై నడిపించినావు
నీ సాక్షిగా నిలబెట్టినావు ||2||
మా మొరలను ఆలించినావు
మాకు సర్వము సమకూర్చినావు ||2|| ||ని||