Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నాదు సర్వం అర్పణగ
నీ పాదముందర నిలిపితిన్
ఆత్మనే నైవేధ్యముగ నే
ప్రీతి తోడ తెచ్చితిన్
స్వీకరించుము నా ప్రభూ
1 వ చరణం..
ఆశతో పేరాశతో నాహృదిని అంధుని చేసితిన్
పాశములు నే త్రెంచి నీదరి
వినయమున నే నిలచితిన్
యుగ యుగాల పాలక నా జీవదాయక
స్వీకరించుము నా ప్రభు నాహృదయకానుక
2 వ చరణం..
ఆదియందున ఆబేలుని గొర్రెపిల్ల బలివలెన్
నాదు తనువు మనసు నీకే
అర్పణగా నే తెచ్చితిన్
నీదు సేవకు అర్పించెద
నాదు సర్వము నాప్రభూ
స్వీకరించుము నాయకా నా హృదయకానుక