Type Here to Get Search Results !

నావన్నీ అంగీకరించు ( navani angikarinchu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నావన్నీ యంగీకరించుమీ దేవా

నన్నెపుడు నీవు కరుణించుమీ 


1. నావన్నీ కృపచేత - నీ వలన నొందిన

భావంబుననునేను-బహుదైర్యమొందెద ||నా|| 


2. నీకు నా ప్రాణము - నిజముగానర్పించి

నీకు మీదు గట్టి - నీ కొరకు నిల్పెద ||నా|| 


3. సత్యంబు నీ ప్రేమ - చక్కగ మదిబూని

నిత్యంబు గరముల - నీ సేవ జేసెద ||నా|| 


4. నీ సేవ జరిగెడు - నీ ఆలయమునకు

నాసనడిపించ -మరులనాపదములు ||నా|| 


5. పెదవులతో నేను - పెంపుగ నీ వార

గదలక ప్రకటింప - గలిగించు దృఢ భక్తి ||నా|| 


6. నా వెండి కనకంబు - నా తండ్రి గైకొనుమీ

యావంతయైనను - నాశింప మదిలోన ||నా|| | 


7. నీవు నాకొసగిన - నిర్మల బుద్ధిచే

సేవ చేయగనిమ్ము - స్థిర భక్తితో నీకు ||నా|| 


8. చిత్తంబు నీ కృపా - యుత్తంబు గావించె

మత్తిల్ల కుండగ - మార్గము దెలుపుము||నా|| 


9. హృదయంబు నీకిత్తు - సదనంబు గావించి 

పదిలంబుగా దాని - బట్టి కాపాడుము ||నా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section