Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
నిత్యాపితా గైకొనుడీ - మేమర్పించు ఈ దివ్యబలి
నీ తిరుసుతుని - యేసుని ద్వారా
గైకొనుడీ - ఈ దివ్యబలి ||2||llనిత్యll
1 వ చరణం..
మేమందరం మీ సన్నిధిలో - కానుక చేసెద వినయముతో ||2||
తిరు రక్తముచే మానవుల - మాలిన్యముల్ కడుగుడి ||2||
2 వ చరణం..
దైవమా మమ్ము – కరుణించుమా
మా పాపముల్ - నీవు క్షమియించుమా ||2||
నీ సన్నిధిలో ఈ కానుకల్-ఆదరముతో స్వీకరించు ||2||