Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ష నడిపించు నా ప్రభువా వెలుగైన నా ప్రభువా
నడిపించు నాదేవా- నను కమ్మిన చీకటిలో
నా అడుగులు స్థిరపరచు ఒక అడుగే చాలుప్రభు
బహుదూరం మనదు ప్రభూ
నడిపించుము ఒక అడుగు ||నడి||
1. మునుపెన్నడు ఈ రీతి నడిపించగ నన్ను నీవు
నీ వేడలేదెప్పుడు నిను కోరలేదెప్పుడు
నా సొంత మార్గములోనే నడిచితి నిదివరకు
నడిపించుమో దేవా ఇకముందు నను నీవు||2|| ||నడి||
2. ప్రేమించితి చెడు దినము-విద్వేషపు భీతులను
అహమేలెను నామదిని గతకాలము
మరువుమయ
నీ శక్తి ఎల్లప్పుడు ఆశ్వాదించినచో
అది తప్పక ఇకముందు
నడిపించు నన్నెపుడు ||2|| ||నడి||
3. ఈ బీడుల భూములలో ఈ కొండల వాగులలో
చీకటి గడిచే వరకు నడిపించు నీ శక్తి ,
చిరకాలము వాంఛించు
ఉషోదయ కాంతులతో
ఆ దూతల నగుమోము
నిలిచేను ఒక ఘడియ ||2|| ||నడి||