Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నడిపిస్తాడు నా దేవుడు - శ్రమలోనైన నను విడువడు
అడుగులు తడబడిన అలసట పైబడిన ||2||
చేయిపట్టి వెన్నుతట్టి చక్కని ఆలోచన చెప్పి ॥న॥
1. అంధకారమే దారిమూసిన - నిందలే నను కృంగదీసిన ||2||
తన చిత్తం నెరవేర్చుతాడు-గమ్యం వరకు నను చేర్చుతాడు||2|| ||న||
2. కష్టాలు కొలిమి కాల్చివేసిన - శోకాలు గుండెను చీల్చి వేసిన ||2||
తన చిత్తం నెరవేర్చుతాడు-గమ్యం వరకు నను చేర్చుతాడు||2|| ||న||
3. నాకున్న కలిమి కరిగిపోయిన - నా యొక్క బలిమి తరిగిపోయిన ||2||
తన చిత్తం నెరవేర్చుతాడు-గమ్యం వరకు నను చేర్చుతాడు||2|| ||న||