Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నైవేద్యపు దివ్వెను నేనై
అర్పించ వచ్చాను నీ ముంగిటిలో ||2||
ప్రార్ధింతును...కరుణించవా
నా ప్రేమ కానుకను స్వీకరించవా ||2||
నా ప్రేమ కానుకను స్వీకరించవా ||నైవేద్యపు||
1. అనురాగ తోరణం నీ ప్రేమయే
ఆనందసాగరం నీ స్నేహమే ||2||
అపురూపమైనది ఈ జీవితం
నీవిచ్చిన వరములు వెలలేనివి ||2||
ఏ రీతిగ కొలుతును స్వామీ
ఓ పూజ్య తండ్రీ నీ కర్పితం ||2|| ||నైవేద్యపు||
2. నా జీవిత పయనంలో తోడువు నీవే
నా జీవన సమరంలో మిత్రుడ నీవే ||2||
శ్రమ జీవన సారం - అప్పద్రాక్షరసము
నీ దేహరుధిరముగ మారును స్వామీ ||2||
పరిశుద్ధమైన ఈ దివ్యబలిలో
ఓ పూజ్య తండ్రీ నీ కర్పితం ||2||
గరిసని..నిసనిప...నిపగరి
నిస సగ పని నిరిస ||నైవేద్యపు||