Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నేనేమి అర్పించెదను ప్రభూ.........
నీకు నేనేమి సమర్పించెదనూ ప్రభూ....
నాలోన ఉన్న శ్వాస నీదే కదా
నాలోని ప్రతి అణువు నీవిచ్చినదే కదా
నాలో ఉన్న జీవం నీ వరమే కదా
నాదు జీవితమే ప్రభువు నీవచ్చిన కృపకదా ||2||
ఆ...............
1 వ చరణం..
ఆబేలునికిచ్చిన పవిత్రమైన మనస్సు ఇవ్వు
ఆ పవిత్ర మనస్సునే బలిగ నేనర్పించెదన్
అబ్రహామునికిచ్చిన త్యాగ బలము నాకు ఇవ్వు
నాలో ఉన్న స్వార్థాన్ని బలిగా నేనర్పించెదను ||2|| llనేనేమిll
2 వ చరణం..
తల్లి మరియకిచ్చిన అర్పిత హృదయం నాకు ఇవ్వు
ఆ అర్పిత మనస్సునే బలిగ నేనర్పించెదన్
పేదరాలికిచ్చిన నిండు మనస్సును నాకు ఇవ్వు
నాలో ఉన్న స్వార్థాన్ని త్యాగ బలిగా అర్పింతు ||2|| llనేనేమిll