Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: అమృత వర్షిణి
ప. నేను నిరుపేదను నా ప్రభూ
నా హృది స్వీకరించు
నా కానుక స్వీకరించు ||2||
1. ధనవంతులేసే వంద కాసులకన్నా
రెండు కాసులేసిన పేదరాలి కానుకను ||2||
మిన్నగా భావించిన ఓ ప్రేమమూర్తి
నన్ను స్వీకరించు-నీ దానిగ స్వీకరించు ||నే||
2. మా సహోదరులలో ఏ ఒకరిని ఆదుకొన్న
అది నీకు అర్పించిన నిజమైన అర్పణని ||2||
నుడివిన ఓ పుణ్యమూర్తి - ముదమార
స్వీకరించు మా అర్పణ స్వీకరించు||నే||