Lyrics: Fr. Gnanam SDB
Tune: Fr. Gnanam SDB
Music: Naveen M
Album: ప్రణతులు -3
ప. నేడు నీకు అర్పించెదను
నాహృదిని నీకు సమర్పింతున్ ||2||
మనసులోని యోచనలను ||2||
ఓ దేవా స్వీకరించు-నా దేవా స్వీకరించు ||నే||
1. తలపు తలుపులను మేలు మలుపులను ||2||
చెలిమి చేతులను కలల ఆశలను ||2||
ఓ దేవా స్వీకరించు నా దేవా స్వీకరించు ||నే||
2. ధనము ధాన్యమును ఫలము పూవులను||2||
తనువు సౌఖ్యమును మనన మోదమును ||2||
ఓ దేవా స్వీకరించు నా దేవా స్వీకరించు ||నే||