Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P
Music: Naveen M
Album: యేసే నా ఆశ - 8
పల్లవి:
నక్కలకు బొరియలున్నవి పక్షులకు గూళ్ళు ఉన్నవి
చేపలకు నీళ్ళు ఉన్నవి
నీకు మాత్రము చోటు లేదయా
అ.ప.
రావాదేవా రావా
నా హృదిలో చోటుందయ్యా
నీకు మాత్రమే చోటుందయ్యా
దివిభువి పట్టని రాజా
నాహృదిలో చోటుందయ్యా
దివ్యసత్ప్రసాదమై (దివ్య కారుణ్యమై) నాలోనికి రావా
1 వ చరణం..
ద్వారము వద్ద నిలుచుండి
తలుపు తట్టుచున్న
నీ స్వరమును వినకుండా
తలుపు తెరవకున్నాll 2ll
ఏంతో ప్రేమతో ఎంతో ఓర్పుతో
మాతో నివశించి భుజియించాలని
ద్వారము బయటే నిలుచుండిన దేవా llరావాll
2 వ చరణం..
అంతిమ దినమున
జీవముతో మము లేపాలని
సదాకాలములో మాలో వుండి నడిపించాలని ll 2ll
ఎంతో త్యాగముతో ఎంతో తగ్గింపుతో
అప్ప రసములో వేంచేయు దేవా llరావాll