Type Here to Get Search Results !

నరులకు రక్షణ నివ్వన్ ( narulaku rakshana niven Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. నరులకు రక్షణ నివ్వన్

నరునిగ వచ్చె నీ భువికిన్ 

మెస్సయ్యా ప్రభు మెస్సయ్యా 

నిజ నజరేసు మెస్సయ్యా 

యేసయ్యా యేసయ్యా 

నజరేతువాసా యేసయ్యా 


1. మధురవిందుగ వచ్చితినీవు

యేసయ్యా, యేసయ్యా 

మమ్ము బ్రోవగ దీవెనలివ్వను

యేసయ్యా యేసయ్యా

జీవపు రొట్టె రూపములోన

కనుమో మమ్మును నీలోనుండ ||2|| ||యే|| 


2. పంచుకో నీ ప్రేమను మాతో

యేసయ్యా యేసయ్యా 

త్రుంచుకొందుము మాలో 

పాపము యేసయ్యా యేసయ్యా

పరము నుండి వచ్చిన 

భోజ్యం వరములిచ్చును నీ శరీరం ||2|| ||యే|| 


3. చిందకుండను రక్తము 

నీవు యేసయ్యా యేసయ్యా 

రసపు రూపాన్నిత్తువు రక్తం 

యేసయ్యా యేసయ్యా 

చివరి ఘడియ వరకును మమ్మున్ 

రక్షణిచ్చుచు మమ్మున్ గావు ||2|| ||యే|| 


4. పరిశుద్ధాత్మను పంపెడి 

నీవు యేసయ్యా యేసయ్యా 

పరిశుద్దాత్మలో పెంచుము 

మమ్ము యేసయ్యా యేసయ్యా 

దివ్య రక్తము మాంసము లివ్వు 

ధరలో మేము ధన్యుల మవ్వన్ ||2|| ||యే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section