Lyrics/Tune: Joseph Konda
Music: Praveen M
Album: పరిశుద్ధాత్మ సన్నిధి - 2
ప. నజరేయుడా నా యేసయ్యా
నమ్మక పాత్రుడవు నీవేనయ్యా -
నీకే నా ఆరాధన నీకే నా స్తుతి ప్రార్థన||2||
1. నీటిలో నడచినను నీవు మునిగిపోలేవులే
అగ్నిలో నడచినను నీవు కాలిపోలేవులే ||2||
అని చెప్పిన వాగ్దానమే నాలో నెరవేర్చుము
నా తండ్రి నాలో నేరవేర్చుము
నీకే నా ఆరాధన నీకే నా స్తుతి ప్రార్థన
2. తల్లి నిన్ను మరచినను -
నేను నిన్ను మరువనులే
నేను నీకు బంగారు భవిష్యత్తు -
ఏర్పరచితినంటివే .. ||2||
నీ వొసగిన వాగ్దానమే
నాలో నేరవేర్చుము
నా తండ్రి నాలో నెరవేర్చుము
నీకే నా ఆరాధన నీకే నా స్తుతి ప్రార్థన