Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సా: నా ప్రాణమా.... నా ప్రాణమా....
నను ఎన్నడు మరువని నా ప్రాణమా ||2||
ప: నేనంటే నీకెందుకో ఈ ప్రేమ
నన్ను మరచిపోవెందుకు ||2||
నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా
నన్ను విడచిపోవెందుకు
కష్టాలలో నష్టాలలో వ్యాదులలో బాధలలో,
కన్నీళ్లలో కడగళ్ళలో వేదనలో శోధనలో
నా ప్రాణమైనావు నీవు,
ప్రాణమా... నా ప్రాణమా ||నేనంటే||
1. నిన్ను మరచిపోయిన నన్ను మరచిపోలేవు
నిన్ను విడిచివెళ్లిన నన్ను వీడిపోలేవు ||2||
ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా ||4||
ఏ రుణమో ఈ బంధము నా ప్రేమమూర్తి
తాళలేను నీ ప్రేమను - నేనంటే నీకెదుకో
ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకు
నా ప్రాణమైనావు నీవు ప్రాణమా
2. ప్రార్థించకపోయినా పలకరిస్తు ఉంటావు
మాట వినకపోయినా కలవరిస్తు ఉంటావు ||2||
ఎందుకింత జాలి నాపై యేసయ్యా ||4||
ఏ ఫలమో ఈ బంధము నా ప్రేమమూర్తి...
తాళలేను నీ ప్రేమను ||నేనంటే||