Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నాలో ఉన్న వాడు బహు బలవంతుడు
నా ముందు వెళ్ళు వాడు జయ శీలుడు
సృష్టికి మునుపే ఉన్న వాడు నా తోడు
వదలనివాడు విడువని వాడు మరువని వాడు నా తోడు
1 వ చరణం..
నే పుట్టకమునుపే పేరు పెట్టి పిలిచాడు
తన అరచేతి లో నన్ను ఎత్తుకొని కాచాడు
నే కూర్చున్న వేళ నిలుచున్న వేళ
ముందుగ తనకు తెలియును
నా మార్గాన్ని వెదకి నా పనులు చేస్తూ llనాలో ఉన్న వాడుll