Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సుస్వారాలు
ప. నాలో వేంచేసిన దేవా నీకే వందనం ||4||
1. క్రీస్తుని ఆత్మమా - నను శుద్దిచేయుమా
క్రీస్తుని శరీరమా - నను రక్షించు.
క్రీస్తుని రక్తమా -నాకు తృప్తి కలుగజేయుమా
క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళా
నను కడుగుమయా-నను కడుగుమయా
నన్ను కడుగుమయా
2. ఓ మంచి జేసువా - నా ప్రార్థన వినుమా
మీ గాయము లోపల- మమ్ము దాచుకొనుమా
నా మరణసమయములో -నీదరికి చేర్చుమా
మీ పునీతులతో కూడ- ముగింపులేని
కాలమున స్తుతియింతుము కీర్తింతుము
ఆరాధించెదము