Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: మార్గం,సత్యం,జీవం - 1
ప: నాలోని ప్రేమజ్యోతిని వెలుంగనీయుమా
ప్రజాళికే నే దివ్వెనై ప్రకాశమియ్యగా ||నా||
1. నీదు ప్రేమ బాటలో - నేను సాగిపోవగా
జీవనాత్మ పదములే - నేను చూచి సాగగా
నాదు కండ్లు తేటగా
ఆదరంబు చూపగా ||2|| ||నా||
2. ఎల్లవేళ నేను నీ దాపుజేరి శాంతిగా
భీతిమాలి ఉండగా
భారమెల్ల తీరగా స్వామి నాకు నేర్పుమా
నూత్న ప్రేమ మార్గము ||2|| ||నా||
3. జీవజలము నీయుమా జీవదాత గావుమా
జీవ మార్గంబునే మమ్ము నడిపింపుమా
చేయి చాచి ప్రేమతో
చేరదీసి నేర్పుమా ||2|| ||నా||