Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నన్ను ఇన్ని నాళ్ళు నీలోన దాచితివే -
నేనిన్నేళ్ళు నీకొరకే బ్రతికితినే
ఎంత ఆశ్చర్యం ఎంత అనురాగం -
ఎంతో ఆనందం ఎంతో ఆశీర్వాదం
దయగల నా దైవమా నేనంటే నీకు అంత ఇష్టమా
కృపగల ఓ నేత్రమా నీ చల్లని చూపే చాలు చైత్రమా
1. కన్నీళ్ళ కడలి కష్టాలతో అలజడి -
నా వెంట తరలి వచ్చేనే వడివడి
దిక్కులేని సమయంలో దరిచేరినావు -
దారిలేని తరుణంలో మార్గమైనావు ||దయ||
2. నా దేహమే ఒడలి అడుగడుగు తడబడి -
కనరాని మజిలి కాలమే ఎదురిడి
కన్నప్రేమ లేకున్నా అన్నీ నీవైనావు-
కంట నీరు రాకున్నా కనుపాపవైనావు ||దయ||