Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకి :ప్రాణ స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా
వేదనలో వెన్నుతట్టి వ్యాధులలో నన్ను తాకిన
ప్రాణ స్నేహితుడా ప్రాణ స్నేహితుడా
ప: నన్ను పేరుపెట్టి పిలిచి నీ సేవలో నను
మలిచి దీవించిన దేవా నీకే స్తోత్రము
నిను విడువను ఎడబాయను నా శ్వాస ఆగే వరకు
పయనింతును తరియింతును నిరతము నీ సేవలో
1. ఎన్నెన్నో శోధనలు నన్నెంతో బాధించినా
నా ఒంటరి తనము నన్ను నిదురలేక వేధించినా
నేనున్నానని నను చేరి లాలించిన దేవా
స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము
2. నాకున్న బాధ్యతలు నాకెంత బరువైనా
నా యాజక గమనములో కష్టాలు తోడొచ్చినా
నేనొస్తానని ననుచేరి నడిపించిన నాధా ||2||
స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము