Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నాపై ఉన్నది-దేవుని ఆత్మ
అభిషిక్తునిగా-చేసిన ఆత్మ
కో. హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ
1. పేదలకు శుభవార్త
ఇల పీడితులకు విమోచన
కారాగార వాసులకు
పరిపూర్ణమగు విడుదలను
ప్రకటించగా నను నియమించెను
అత్మాభిషేకమున అలరించెను ||హల్లెలూయ||
2. అంధులకు కనుదృష్టి
అసహాయుల యెడ ఆదరణ
తోడూ నీడ నీయుటకు
హితవత్సరమును చాటుటకు
తన దూతగా నన్ను పంపించెను
ఆత్మానుసారమున నడిపించెను ||హల్లెలూయ||
3. దారి తప్పిన నన్ను వెదకి చేరదీసి
సరియైన మార్గమును నాకు చూపి
నీదుబాటలో నన్ను నడుపుమయ్యా llఅల్లెలూయll