Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నరరూప దేవా ప్రభువా
జగన్మోహనాకార యేసువా
మనుజాళి కొరకై స్లీవమ్రానును
మేనున మోసినావా ఆ ఆ ఆ ఆ
1 వ చరణం..
నమ్మినవారే ఆశకులొంగి
అమ్మిరి యేసుని ధూర్తుని భంగి ఆ ఆ ఆ
అంగనలంతా దుంఖమునొంది
అమానుషమని విలపించినారే నర
2 వ చరణం..
హేళనచేయ మోమున ఉమిసి
తలపై ముళ్ళకిరిటము నదిమి ఆ ఆ ఆ
తులువలు కొందరు సిలువను మోపి
కల్వరిగిరికి నడిపించినారే నర