Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నేడే ఈనాడే సంబరాల క్రీస్తు జయంతి
సంతోషగానాల క్రీస్తు జయంతి -
శాంతి సమతల ప్రేమ స్రవంతి
1. ఉదయించిన దేవునికి ఉప్పొంగే హృదయంతో-
అంజలించెదం - అంజలించెదం
మమతలతో కూడిన ప్రేమ సంగీతంతో
పల్లవించెదం - పల్లవించెదం
అందరి హృదయాలలో ఆశాదీపికగా -
అరుదెంచెను యేసు అనురాగంతో
2. పదిమంది కలసి మెలసి పరిమళాలు పంచేటి
సమాజమే స్థాపిద్దాం - సమాజమే స్థాపిద్దాం
మనజీవన యాత్రలో ముళ్ళపొదలు ఛేదించి
పూల పంట పండిద్దాం పూలజల్లు కురిపిద్దాం