Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నరరూపధారి నజరేతు ప్రభువ
నడిపించునన్ను నీ దారిలోన
సత్యం నీవై జీవం నీవై
మార్గం నీవై వెలసిన ప్రభువ ||న||
1. కన్య మరియ గర్భమందున
జనన మొందిన ఓ బాల ఏసా
దీనులకు దీపం నీవై
పాపుల పాలిటి రక్షణ నీవై ||న||
2. ముసిముసి నవ్వుల ఓ దివ్య బాలుడ
కంటికి పాపవై ఇంటికి జ్యోతివై
కాపాడి కరుణించి మమ్మేలవయ్యా
కాంతిని చూపే ఓ కాంతి దూతను ||న||